కలం కార్మికుడు రామోజీ రావు
ప్రముఖ విశ్లేషకుడు నాగేశ్వర్ రావు
హైదరాబాద్ – పాత్రికేయ రంగంలో నిత్య శ్రామికుడు అని రామోజీ రావు గురించి కొనియాడారు ప్రముఖ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్. సమయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ఇది తనలో చూశానని అన్నారు. రామోజీ రావును ఇంటర్వ్యూ చేసే అవకాశం తనకు దక్కిందని చెప్పారు.
రామోజీ సంస్థల చీఫ్ రామోజీ రావు మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నాగేశ్వర్ మాట్లాడారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం అత్యంత గొప్పదన్నారు.
పాత్రికేయ రంగంలోకి రావాలని అనుకున్న వారికి రామోజీ రావు స్పూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు. అందుకే ఆయన మీడియా మొఘల్ గా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. నేటి తరాలకే కాదు రేపటి తరాలకు కూడా ఆదర్శ ప్రాయంగా ఉంటారని అనడంలో సందేహం లేదన్నారు నాగేశ్వర్.
రామోజీ రావు అక్షర యోధుడు, కలం కార్మికుడని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తాను అభిమానించే వారిలో రామోజీ అకరు అని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్సీ.