కంగనా కామెంట్స్ రైతులు సీరియస్
ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్
పంజాబ్ – ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ పై సీరియస్ అయ్యారు పంజాబ్ కు చెందిన రైతులు. తమ గురించి చులకన చేస్తూ కంగనా కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. ఇప్పటి వరకు తాము సంమయనం పాటించామని కానీ ఇంకోసారి తల తిక్కగా వ్యాఖ్యానిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంథేర్ . ఆయన మొహాలీలో మీడియాతో మాట్లాడారు.
ఇతరుల గురించి ప్రత్యేకించి రైతులు, మహిళలు, సోదరీమణుల గురించి చెడుగా మాట్లాడే హక్కు నటి , ఎంపీ కంనా రనౌత్ కు లేదని ఆ విషయం తెలుసుకుంటే మంచిదని పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులంతా కలిసి మొహాలీలో కంగనాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టనున్నారని ప్రకటించారు సర్వన్ సింగ్ పంథేర్. ద్వేష పూరిత భాషను ఉపయోగిస్తున్న ఆమెకు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.