అరుదైన దృశ్యం చెరగని బంధం
రామోజీ ఫోటను పంచుకున్న శ్రీధర్
హైదరాబాద్ – కార్టూనిస్ట్ శ్రీధర్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. కోట్లాది మందిని తన కార్టూన్ల ద్వారా చైతన్యవంతం చేసిన వ్యక్తి. అసలు కార్టూనిస్ట్ శ్రీధర్ ఎలా ఉంటాడో తెలియలేదు చాన్నాళ్లకు. ఈ మధ్యన ఆయన ఈనాడు నుంచి బయటకు వచ్చారు. పదవీ విరమణ పొందడంతో ఆ పత్రికతో కొన్నేళ్ల పాటు కలిగిన అనుబంధాన్ని బాధాతప్త హృదయంతో తెంచుకున్నారు.
ఒక రకంగా కన్నీటి పర్యంతం అయ్యారు కూడా. ఈనాడు పత్రికాధిపతి రామోజీ రావు ఏరికోరి శ్రీధర్ ను ఎంచుకున్నారు. ఆయనను వెన్నుతట్టి ప్రోత్సహించారు. తనలోని ప్రతిభను గుర్తించారు. రామోజీ అందించిన సపోర్ట్ తో వేల కొద్ది కార్టూన్లు వేశారు శ్రీధర్. ఆ కార్టూన్లు ప్రజలను కదిలించాయి. వారిని ప్రేరేపించేలా చేశాయి. భారత దేశ చరిత్రలో ఎన్నదగిన అతి కొద్ది మంది కార్టూనిస్టులలో తెలుగు వాడైనా , తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీధర్ ఒకరు కావడం విశేషం. మనందరికీ గర్వ కారణం.
ఇదిలా ఉండగా చెరుకూరి రామోజీరావు అనారోగ్యంతో కన్ను మూశారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇవాళ శ్రీధర్ అరుదైన ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటో ఇప్పుడు ఎంతో మందిని కదిలిస్తోంది. రామోజీ, శ్రీధర్ మధ్య ఉన్న అవినాభావ , ఆత్మీయ అనుబంధాన్ని తెలియ చేస్తోంది. హ్యాట్సాఫ్ శ్రీధర్.