మోడీకి నమ్మిన బంటుని
చిరాగ్ పాశ్వాన్ కామెంట్
న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాడు చిరాగ్ పాశ్వాన్. తనను అవమానించినా సరే తాను ఏమీ అనుకోనని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తాను నమ్మిన బంటునని, ఒక రకంగా చెప్పాలంటే తాను హనుమంతుడి లాంటి వాడినని చెప్పారు.
చిరాగ్ పాశ్వాన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. తన పార్టీ ఈసారి బీహార్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 5 సీట్లు గెలుపొందింది. మరో వైపు యువ నాయకుడు , మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ప్రభావితం చూపారు. అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
గతంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీయే లో చిరాగ్ పాశ్వాన్ భాగస్వామిగా ఉన్నారు. తన బాబాయ్ ని ప్రోత్సహించింది బీజేపీ. చిరాగ్ పాశ్వాన్ ను ఘోరంగా అవమానించింది. అయినా తను వాటిని మరిచి పోయాడు. ప్రధాని మోడీతో అనుబంధాన్ని కోరుకున్నాడు. చివరి దాకా తనతో పాటే ఉంటానని ప్రకటించాడు.
ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి ఆహ్వానం పలికినా , ఆఫర్ ఇచ్చినా పట్టించు కోలేదు. దీంతో నరేంద్ర మోడీ చిరాగ్ ను తన స్వంత కొడుకులా చూసుకున్నాడు. ప్రజలందరి సమక్షంలో హత్తుకున్నాడు.