NEWSNATIONAL

అఖిలేష్ యాద‌వ్ రాజీనామా

Share it with your family & friends

లోక్ స‌భ‌కు వెళ్ల‌నున్న మాజీ సీఎం

ఉత్త‌ర ప్ర‌దేశ్ – స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ , మాజీ యూపీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను శాస‌న స‌భ ప‌క్ష నేత ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌ను తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేశారు. త‌ను గెలుపొంద‌డంతో పాటు త‌న వారిని గెలిపించుకున్నారు. ఊహించ‌ని రీతిలో యూపీలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి, ముఖ్యంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ కు షాక్ ఇచ్చారు అఖిలేష్ యాద‌వ్.

ఎస్పీ చీఫ్ దెబ్బ‌కు భారీగా దెబ్బ ప‌డింది. త‌ను దేశ రాజ‌కీయాల‌లో కీల‌క‌మైన పాత్ర పోషించాల‌ని ఉంద‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు తాను శాస‌న స‌భ కంటే పార్ల‌మెంట్ లో ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు .

శాస‌న స‌భా ప‌క్ష నేత ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు అఖిలేష్ యాద‌వ్. ప్ర‌ధాన మంత్రి మోడీపై భ‌గ్గుమ‌న్నారు. ఆయ‌న నైతికంగా ఓట‌మి పాల‌య్యారంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌లు బీజేపీని, పీఎంను వ‌ద్ద‌ని తీర్పు చెప్పార‌ని ఈ విష‌యం ఫ‌లితాల‌లో వెల్ల‌డైంద‌న్నారు.