తరగని స్పూర్తి రామోజీ
హెరిటేజ్ ఎండీ బ్రాహ్మణి
హైదరాబాద్ – రామోజీ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు లేని లోటు తీర్చ లేనిదని పేర్కొన్నారు హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి. ఆయన మరణం తెలుగు జాతికి, యావత్ దేశానికి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగారని, మహోన్నత వ్యక్తిగా మారారని కొనియాడారు నారా బ్రాహ్మణి. తమ కుటుంబానికి అత్యంత ఆప్తులు పోవడం దారుణమని వాపోయారు.
నాలాంటి వేలాది మంది యువతకు స్పూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు . సమాజ వికాసం, ప్రజా సంక్షేమం లక్ష్యంగా రామోజీరావు సాగించిన ప్రస్థానం అద్భుతమని పేర్కొన్నారు . అక్షర యోధుడిగా కోట్లాది మందిని ప్రభావితం చేశారని ప్రశంసించారు నారా బ్రాహ్మణి.
ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి, ఉషా కిరణ్ , రామోజీ పిలిం ను ఏర్పాటు చేసి వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఘనత చెరుకూరి రామోజీరావుకు దక్కుతుందని పేర్కొన్నారు.