ANDHRA PRADESHNEWS

పెమ్మ‌సాని..రామ్మోహ‌న్ కు చోటు

Share it with your family & friends

పీఎంఓ నుంచి ఫోన్ కాల్స్

హైద‌రాబాద్ – ఎన్డీయే – భార‌తీయ జ‌న‌తా పార్టీతో కూడిన సంకీర్ణ స‌ర్కార్ ఆదివారం కొలువు తీర‌నుంది. ఇందులో భాగంగా ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

కొత్త‌గా కేబినెట్ లోకి ఎవ‌రిని తీసుకుంటార‌నే దానిపై చ‌ర్చోప చర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతానికి తొలి విడ‌త‌గా 20 మందికి అవ‌కాశం ద‌క్క‌నున్న‌ట్లు స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ తో పాటు రామ్మోహ‌న్ నాయుడుకు చోటు ల‌భించ‌నుంది.

ఇప్పటికే ప్ర‌ధాన‌మంత్రి కేంద్ర కార్యాల‌యం నుంచి ఈ ఇద్ద‌రు ఎంపీల‌కు ఫోన్ కాల్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈసారి కొత్త‌గా ఏర్పాటైన ప్ర‌భుత్వానికి కీల‌క మ‌ద్ద‌తు ఇచ్చారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్.

మ‌రికొన్ని కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌నున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇరు పార్టీలు గ‌నుక మ‌ద్ద‌తు ఇవ్వ‌క పోయి ఉంటే ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌క పోయి ఉండేది ఎన్డీయే, బీజేపీ.