NEWSNATIONAL

జై శంక‌ర్..నిర్మ‌ల‌కు పిలుపు

Share it with your family & friends

మోడీ కేబినెట్ లో చేరిక

న్యూఢిల్లీ – న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కొత్త కేబినెట్ లో ప‌లువురికి చోటు ద‌క్క‌నుంది. తాజాగా తెలంగాణ నుంచి బండి సంజ‌య్ కు ఆఫ‌ర్ ల‌భించ‌డం విశేషం. ఆయ‌న‌తో పాటు గంగాపురం కిష‌న్ రెడ్డి, ఏపీ నుంచి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ , రామ్మోహ‌న్ నాయుడుకు కూడా పీఎంఓ నుంచి పిలుపు వ‌చ్చింది.

ఇవాళ ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోడీ కొలువు తీరారు. త‌న కొత్త కేబినెట్ లోకి 20 మందికి చోటు క‌ల్పించారు. వారిలో గ‌త కేబినెట్ లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాదు ఆయా ప‌ద‌వుల‌కు పేరు తీసుకు రావ‌డంలో స‌క్సెస్ అయ్యారు సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ , నిర్మ‌లా సీతారామ‌న్.

ఒక‌రు విదేశాంగ శాఖ మంత్రిగా పేరు పొందితే మ‌రొక‌రు భార‌త దేశాన్ని ఆర్థిక రంగంలో కీల‌క మార్పులు తీసుకు రావ‌డంలో పేరు తెచ్చుకున్నారు. ఇవాళ ప్ర‌ధాన‌మంత్రి కేంద్ర కార్యాల‌యం నుంచి వీరంద‌రికీ ఫోన్లు వ‌చ్చాయి. మూడోసారి ఎన్డీయే కేబినెట్ లో జై శంక‌ర్ , సీతా రామ‌న్ చేర‌నున్నారు.