మోడీ మంత్రివర్గంపై ఉత్కంఠ
పలువురు కొత్త వారికి బిగ్ చాన్స్
న్యూఢిల్లీ – కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ కేబినెట్ కొలువు తీరింది. ఎప్పటి లాగే భారతీయ జనతా పార్టీ కీలక పదవులను నిలబెట్టుకుంది. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జై శంకర్ , నిర్మలా సీతారామన్ , కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కు చోటు దక్కనుంది.
ఏపీ నుంచి బండి సంజయ్ కి కొత్తగా ఛాన్స్ లభించింది. ఇక ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు కు పిలుపు వచ్చింది. బీహార్ నుంచి చిరాగ్ పాశ్వాన్ కూడా ఆఫర్ ఇచ్చారు మోడీ. తన నివాసంలో టీ విందు ఇవ్వనున్నారు ప్రధానమంత్రి.
గతంలో నిర్వహించిన ప్రధాన శాఖలు బీజేపీ ఎంపీలకు ఇవ్వనున్నట్టు టాక్. అప్పా దళ్ కు చెందిన సోనే లాల్ , అనుప్రియా పటేల్ , ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి, హిందూస్తానీ అవామ్ మోర్చాకు చెందిన జితిన్ రామ్ మాంఝీలకు మంత్రి పదవులు దక్కనున్నాయి.
ఇక ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేనకు చెందిన ఎంపీ ప్రతాప్ రావు జాదవ్ , రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రాందాస్ అథవాలే మరోసారి కొలువు తీరనున్నారు. కర్ణాటక నుంచి ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎంలు ఖట్టర్ , శివ రాజ్ సింగ్ చౌహాన్ తో పాటు జ్యోతిరాదిత్యా సింధియాకు కూడా కేబినెట్ లో చోటు దక్కనుంది.
వీరితో పాటు సర్ఫానంద సోనోవాల్ , కిరణ్ రిజిజు , శోభా కరంద్లాజే , బీఎల్ వర్మ , నిత్యానంద్ రాయ్ , గిరిరాజ్ సింగ్ కు కూడా పదవులు దక్కనున్నాయి.