కేబినెట్ లో కొత్త పాతల కలయిక
40 మందికి మోడీ కేబినెట్ లో చోటు
న్యూఢిల్లీ – ఎన్డీయే – భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువు తీరింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిరథ మహారథులు, భాగస్వామ్య పక్షాల పార్టీలకు చెందిన అధినేతలు హాజరయ్యారు.
ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ రాష్ట్రం నుంచి మరో ఇద్దరికి కేబినెట్ చోటు కల్పించారు మోడీ. ఇక గత ప్రభుత్వ హయాంలో కీలకమైన పదవులు నిర్వహించిన వారికి తిరిగి అప్పగించనున్నారు. కొత్త కేబినెట్ లో అమిత్ చంద్ర షా, మాండవియా, అశ్విని వైష్ణవ్ , నిర్మలా సీతారామన్ , పీయూష్ గోయల్ , జితేంద్ర సింగ్ , శివ రాజ్ సింగ్ చౌహాన్ , హర్దీప్ సింగ్ పూరి, హెచ్ డీ కే, చిరాగ్ పాశ్వాన్ , నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ , జ్యోతిరాదిత్యా సింధియా ఉన్నారు.
వీరితో పాటు కిరెన్ రిజిజు, గిరిరాజ్ సింగ్ , జయంత్ చౌదరి, అన్నామలై కుప్పు స్వామి, ఖట్టర్ , సురేష్ గోపి, జితిన్ రామ్ మాంఝీ , రామ్ నాథ్ ఠాకూర్ , జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ , అర్జున్ రామ్ మేఘ్వాల్ , ప్రహ్లాద్ జోషి, చంద్రశేఖర్ చౌదరి, చంద్రశేఖర్ పెమ్మనాని, రామ్మోహన్ నాయుడు, రవ్ నీత్ సింగ్ భిట్టు, జితిన్ ప్రసాద్ , పంకజ్ చౌదరి, బీఎల్ వర్మ, లాలన్ సింగ్ , సోనో వాల్ , అనుప్రియా పటేల్, ప్రతాప్ రావ్ జాదవ్, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడసే, శోభా కరంద్గాజే, కమల్జీత్ సెహ్రావత్ , రావు ఇందర్ జీత్ సింగ్ , రామ్ దాస్ అథావలే, హర్ష్ మల్హోత్రా కేబినెట్ లోకి తీసుకున్నారు.