NEWSANDHRA PRADESH

36 ఏళ్ల‌కే రామ్మోహ‌న్ నాయుడికి ఛాన్స్

Share it with your family & friends

సిక్కోలు బిడ్డ‌కు చంద్రబాబు ప్రాధాన్య‌త
అమ‌రావ‌తి – మోడీ కేంద్ర మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కింది ఏపీకి చెందిన యువ నాయ‌కుడు , ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు. టీడీపీ నుంచి ఎంపికైన ఎంపీల‌లో చిన్న వ‌య‌సు ఈయ‌న‌దే కావ‌డం విశేషం. ఉత్త‌రాంధ్ర నుంచి కింజార‌పు కుటుంబానికి ప్ర‌యారిటీ ఇచ్చారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు.

కేంద్ర మంత్రిగా వెనుక‌బ‌డిన త‌ర‌గతి సామాజిక వ‌ర్గానికి ప్ర‌యారిటీ ఇవ్వ‌డం విశేషం. రామ్మోహ‌న్ నాయుడు వ‌య‌సు కేవ‌లం 36 ఏళ్లు. ప్ర‌స్తుతం కొలువు తీరిన మంత్రి వ‌ర్గంలో అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన వ్య‌క్తి .

ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉన్నారు రామ్మోహ‌న్ నాయుడు. వ‌రుస‌గా ఆయ‌న మూడుసార్లు లోక్ స‌భ స‌భ్యుడిగా ప‌ని చేశారు. ఇది కూడా ఉత్త‌రాంధ్ర నుండి రికార్డ్. ఆయ‌న తండ్రి గ‌తంలో కేంద్ర మంత్రిగా ఉంటూ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. ఆయ‌న సోద‌రుడు ప్ర‌స్తుతం టీడీపీ చీఫ్ గా ఉన్నారు.

ఇక కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు విద్యావంతుడు. పార్ల‌మెంట్ లో ఏపీ స‌మ‌స్య‌లను ప్ర‌స్తావిస్తూ వ‌చ్చారు. ఆయ‌న బీటెక్, ఎంబీఏ చేశారు.