అనుభవం వైష్ణవ్ స్వంతం
మోడీ కేబినెట్ లోకి మరోసారి
న్యూఢిల్లీ – ఎన్డీయే సంకీర్ణ సర్కార్ లో మోడీకి నమ్మకస్తుడిగా గుర్తింపు పొందారు అశ్విని వైష్ణవ్. తను రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. కొత్తగా కొలువు తీరిన కేబినెట్ లో తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా కూడా పని చేశారు.
అశ్విన వైష్ణవ్ 18 జూలై 1970లో పుట్టారు. ఆయన వయసు 53 ఏళ్లు. ఆయన స్వస్థలం రాజస్థాన్ లోని జోధ్ పూర్. భారతీయ జనతా పార్టీలో 2019 నుండి కొనసాగుతూ వస్తున్నారు. ఇద్దరు పిల్లలు. ఎంటెఎక్, ఎంబీఏ చేశారు. ఐఐటీ కాన్పూర్ స్టూడెంట్.
మాజీ ఐఏఎస్ ఆఫసర్. అంతే కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త. అంతే కాదు జీఈ ట్రాన్స్ పోర్టేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సీమెన్స్ కు వైస్ ప్రెసిడెంట్ గా కూడా పని చేశారు.
39వ రైల్వే శాఖ మంత్రిగా, 55వ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా పని చేశారు. ఒడిషాలో ఐఏఎస్ గా విధులు చేపట్టారు. ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందారు. మాజీ ప్రధాని వాజ్ పేయి ఆఫీసులో డిప్యూటీ సెక్రటరీగా పని చేసిన అనుభవం ఉంది. 2006లో మోర్ముగావ్ పోర్ట్ ట్రస్ట్ కు డిప్యూటీ చైర్మన్ గా కూడా ఉన్నారు.
2012లో గుజరాత్ లో త్రీ టీ ఆటో లాజిస్టిక్స్ , వీజీ ఆటో కాంపోనెంట్స్ కంపెనీలను స్థాపించాడు. వివిధ కంపెనీలలో ఎండీగా పని చేశాడు అశ్విని వైష్ణవ్.