NEWSNATIONAL

నితిన్ గ‌డ్క‌రీ గ‌ట్టోడు

Share it with your family & friends

మోడీ కేబినెట్ లోకి

మ‌హారాష్ట్ర – కాలం ఎప్పుడూ ఒకేసారిగా ఉండ‌దు. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ కేంద్ర మంత్రిగా ప‌ని చేసిన నితిన్ గ‌డ్క‌రీ. త‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడతాడు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా కేంద్ర స్థాయికి ఎదిగాడు. ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రిగా ప‌ని చేశాడు.

త‌ను ఒకానొక ద‌శ‌లో ప్ర‌ధాన‌మంత్రి మోడీతో పోటీ ప‌డ్డాడు. ఒకానొక ద‌శ‌లో త‌ను పోటీకి వ‌స్తున్నాడ‌ని మోడీ, షా తొక్కిపెట్టేందుకు ప్ర‌య‌త్నం చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ నితిన్ గ‌డ్క‌రీ గ‌ట్టోడు. త‌ను ఫీనిక్స్ ప‌క్షి లాగా పోటీ ప‌డుతూనే వ‌స్తున్నాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు.

ఈసారి 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేశాడు. తిరిగి గ‌డ్క‌రీకి గ‌త్యంత‌రం లేక మోడీ త‌న కేబినెట్ లోకి తీసుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న వెనుక బీజేపీని, దాని ప‌రవారాన్ని శాసిస్తూ వ‌స్తున్న విశ్వ హిందూ ప‌రిష‌త్ తో పాటు ఆర్ఎస్ఎస్ కూడా ఉంది. ఈ రెండు సంస్థ‌లు ఎవ‌రికైతే ప్ర‌యారిటీ ఇస్తుందో వారికి త‌ప్ప‌క ఇవ్వాల్సిన ప‌రిస్థితి.

అందుకే బీజేపీలో అంద‌రూ అంటుంటారు నితిన్ గ‌డ్క‌రీ మామూలోడు కాదు అని. నిజం క‌దూ.