SPORTS

అబ్బా బుమ్రా దెబ్బ

Share it with your family & friends

4 ఓవ‌ర్లు 14 ర‌న్స్ 3 వికెట్లు

అమెరికా – ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా అమెరికా లోని న్యూయార్క్ లో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. దాయాది పాకిస్తాన్ జ‌ట్టును 6 ప‌రుగుల తేడాతో ఓడించింది. మ‌రోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ లో త‌న‌కు ఎదురే లేద‌ని చాటి చెప్పింది.

పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భార‌త బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేశారు. కేవ‌లం రిష‌బ్ పంత్ మాత్ర‌మే రాణించాడు. 42 ర‌న్స్ చేశాడు. మిగ‌తా వారంతా చేతులెత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో భార‌త జ‌ట్టు 119 ర‌న్స్ చేసింది.

అనంత‌రం బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది టీమిండియా. భార‌త బౌల‌ర్లు జ‌స్ప్రీత్ బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్ , హార్దిక్ పాండ్యా క‌ళ్లు చెదిరే బంతుల‌తో ఆక‌ట్టుకున్నారు. పాకిస్తాన్ జ‌ట్టును శాసించాడు బుబ్రా. కేవ‌లం 4 ఓవ‌ర్లు వేసి 14 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి మూడు కీల‌క‌మైన వికెట్ల‌ను కూల్చాడు. దీంతో జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన బుమ్రాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.