మోడీ కేబినెట్ లోకి జేపీ నడ్డా
బీజేపీ చీఫ్ పదవికి గుడ్
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఊహించని రీతిలో కేంద్ర కేబినెట్ లో చేరారు. ఆయన సారథ్యంలో పార్టీ విజయాలు సాధించింది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. ఆర్ఎస్ఎస్ , ఏబీవీపీలో పని చేశారు. 1991లో భారతీయ జనతా యువ మోర్చా చీఫ్ గా ఉన్నారు.
జేపీ నడ్డా నాలుగు సంవత్సరాలకు పైగా బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన వయసు 63 ఏళ్లు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్ ప్రదేశ్ నుండి ఏకైక ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు ఇంకా ఏ శాఖ కేటాయిస్తారనేది ఖరారు కాలేదు.
జేపీ నడ్డా నవంబర్ 9, 2024 నుండి మే 30, 2019 వరకు మోడీ తొలి కేబినెట్ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. అంతకు ముందు బీజేపీలో కీలక పదవులు చేపట్టాడు. దేశ వ్యాప్తంగా బీజేపీ గెలుపు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తన స్వంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమిత్ షా తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టారు జేపీ నడ్డా.