కౌన్సిలర్ నుంచి మంత్రి దాకా
ఏపీ నుంచి మూడో వ్యక్తికి
అమరావతి – ఎవరూ ఊహించని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీగా గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కడం విస్తు పోయేలా చేసింది. ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని ప్రమాణ స్వీకారం చేశారు.
తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఏకంగా 2.76 లక్షల ఓట్ల మెజారిటీని సాధించారు. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు.
1988 లో కాషాయ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. 1992-95లో జిల్లా యువ మోర్చా చీఫ్ గా ఉన్నారు. 2008 నుండి 2014 దాకా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.
ఇదే ఏడాదిలో వార్డు కౌన్సిలర్ గా గెలుపొందారు. ఇన్ చార్జ్ చైర్మన్ గా పని చేశారు. ఆయన ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఏ చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర కేబినెట్ లో గుజరాత్ కు చెందిన సీఆర్ పాటిల్ కానిస్టేబుల్ గా పని చేసి కేంద్ర మంత్రిగా అయితే శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి కావడం విశేషం.