ఏపీలో సెలవులు పొడిగింపు
జూన్ 12 వరకు వర్తింపు
అమరావతి – రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో విద్యార్థులకు, విద్యా సంస్థలకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో వేసవి సెలవులను ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సర్కార్ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ఇదే సమయంలో జూన్ 13న తిరిగి పాఠశాలలు తిరిగి తెరుస్తామని పేర్కొన్నారు సీఎస్.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలి పోయింది. నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.
దీంతో రాష్ట్రంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కీలకమైన ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఈనెల 12న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.