ఏపీలో రౌడీయిజాన్ని లేకుండా చేస్తాం
ప్రకటించిన జనసేన నేత నాగబాబు
అమరావతి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్డీయే సర్కార్ కొలువు తీరిన సందర్బంగా ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా జాతీయ మీడియాతో మాట్లాడారు. సమర్థవంతుడైన నాయకుడు మోడీ మార్గదర్శకత్వంలో భారత దేశం ముందుకు వెళుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఈ దేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి కూడా స్పూర్తి దాయకమైన లీడర్ గా గుర్తింపు పొందారని అన్నారు.
ఇదే సమయంలో అరాచకత్వం, మోసం, దౌర్జన్యం అనేది ఎక్కువ కాలం నడవవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో చోటు చేసుకున్న, పెచ్చరిల్లి పోయిన రౌడీయిజంపై. దీనిపై తీవ్రంగా స్పందిస్తూ నాగబాబు మండిపడ్డారు. రౌడీ ఇజాన్ని కూకటివేళ్లతో లేకుండా చేస్తామని హెచ్చరించారు.
తమ ముందున్న ప్రధాన లక్ష్యం ఒక్కటేనని స్పష్టం చేశారు నాగ బాబు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పాలన గాడి తప్పిందని దానిని సక్రమ మార్గంలో పెట్టేందుకు కొంత సమయం పడుతుందన్నారు నాగ బాబు.