రైతుల కోసం పీఎం తొలి సంతకం
కిసాన్ నిధి కింద రూ. 20,000 కోట్లు
న్యూఢిల్లీ – కేంద్రంలో ప్రధాన మంత్రిగా కొలువు తీరిన నరేంద్ర దామోదర దాస్ మోడీ సోమవారం న్యూఢిల్లీ కార్యాలయంలో తొలి ఫైల్ పై సంతకం చేశారు. ఎన్డీయే, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఏర్పాటైంది. ఇందులో కీలకమైన పాత్ర పోషించారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్.
ఈ రెండు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించాయి. మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధానమంత్రి కిసాన్ నిధికి సంబంధించి 17వ విడత నిధుల విడుదల ఫైల్ పై తొలి సంతకం చేశారు .
దీని వల్ల దేశంలోని 9 కోట్ల 30 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. ఈ మేరకు రైతులకు చెందిన బ్యాంకు ఖాతాలలో నేరుగా కేంద్ర సర్కార్ నిధులను జమ చేయనుంది. ఇందులో భాగంగా దాదాపు రూ. 20,000 కోట్లకు పైగా డబ్బులు ప్రధానమంత్రి కేంద్ర కార్యాలయం పంపిణీ చేస్తుంది.