జనసేన శాసన సభాపక్ష నేతగా పవన్
ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
అమరావతి -ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని రీతిలో విజయాలు సాధించిన జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈనెల 12న టీడీపీ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కీలకంగా మారనున్నారు.
మంగళవారం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తాజాగా ఏపీలో జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, 2 లోక్ సభ ఎంపీలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా శాసన సభా పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు.
ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసన సభా పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ను ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నిక ఇక లాంఛన ప్రాయంగా ఖరారైనట్టు భావించక తప్పదు.