హైదరాబాద్ లో పతంగుల పండుగ
సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్ – తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా పతంగుల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డిని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతినిధులు కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయనను రావాలని కోరారు.
ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ -2024 పేరుతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యాటక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆధ్వర్యంలో పర్యాటక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణతో పాటు ఇతర అధికారులు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.
తప్పక రావాలని కోరారు. పతంగుల పండుగను సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో దీనిని చేపడతారు. పిల్లలు, పెద్దలు కలిసి పతంగులను ఎగుర వేస్తారు. ఈ ఫెస్టివల్ కార్యక్రమం ఈనెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ లోని నగర వాసులంతా ఈ అంతర్జాతీయ పతంగుల ఉత్సవంలో పాల్గొనాలని కోరారు మంత్రి జూపల్లి కృష్ణారావు.