కొలువు తీరిన మంత్రులు..శాఖలు
ఖరారు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ – ఎట్టకేలకు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా కొలువు తీరారు నరేంద్ర మోడీ. 72 మందితో తన కేబినెట్ ను రూపొందించారు. కీలకమైన వ్యక్తులకు తగిన పదవులు ఇవ్వడంలో భారీ ఎత్తున కసరత్తు చేశారు పీఎంతో పాటు కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా.
ఇక శాఖల వారీగా చూస్తే ఇలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్ నాథ్ సింగ్ కు గత సర్కార్ లో ఉన్న పాత శాఖనే కేటాయించారు. ఆయనకు రక్షణ శాఖను అప్పగించారు. అమిత్ షాకు హోం శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్లు, రహదారుల శాఖ, జేపీ నడ్డాకు ఆరోగ్య శాఖను కేటాయించారు మోడీ.
శివ రాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం, రైతు సంక్షేమం, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ, ఎస్ జై శంకర్ కు విదేశాంగ శాఖ, మనోహర్ లాల్ ఖట్టర్ కు విద్యుత్ , గృహ నిర్మాణ శాఖ, ధరేంద్ర ప్రధాన్ కు విద్యా శాఖ కేటాయించారు.
ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ, చిరాగ్ పాశ్వాన్ కు క్రీడా, యువజన సర్వీసుల శాఖ, కిరణ్ రిజిజుకు పార్లమెంటరీ వ్యవహారాలు, అశ్విని వైష్ణవ్ కు రైల్వే శాఖ అప్పగించారు.
సోనో వాల్ కు షిప్పింగ్ , పోర్టులు, సింధియాకు ఈశాన్య అభివృద్ది, టెలికాం, కుమార స్వామికి భారీ పరిశ్రమలు , ఉక్కు శాఖ, అన్న పూర్ణా దేవికి స్త్రీ సంక్షేమ శాఖ, గిరి రాజా సింగ్ కు వస్త్ర శాఖ, అర్జున్ రామ్ మేఘావల్ కు న్యాయ శాఖ కేటాయించారు.