రేపే ఏపీ సీఎంగా బాబు ప్రమాణం
హాజరు కానున్న ప్రధాని మోడీ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా కొలువు తీరనున్నారు. ఈ మేరకు పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా జూన్ 12న ముహూర్తం నిర్ణయించినట్లు పేర్కింది.
ఆరోజు ఉదయం 11.27 గంటలకు కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీయే , భారతీయ జనతా పార్టీకి చెందిన కీలకమైన నాయకులు, సీఎంలు, మాజీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారని వెల్లడించింది.
ఇదిలా ఉండగా తాజాగా ఏపీలో జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. ఏకైక పార్టీగా అవతరించింది. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ, బీజేపీకి కలిపి 163 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఇది రికార్డ్. ఇక ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి.
కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రత్యేకంగా హాజరు కానున్నారని టీడీపీ వెల్లడించింది. దీంతో సీఎం ప్రమాణ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న ఏర్పాట్లు చూస్తున్నారు.