బాబుతో ఆలింగనం పవన్ భావోద్వేగం
అద్భుతమైన పాలన అందించాలని పిలుపు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరనున్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం టీడీపీ కూటమి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. గెలుపొందిన టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా టీడీపీ ప్రజా ప్రతినిధులు ఏకగ్రీవంగా తమ శాసన సభ పక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నారు. ఇక జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నుంచి పురందేశ్వరి వారి తరపున సంపూర్ణ మద్దతు చంద్రబాబు నాయుడుకు అందజేస్తున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్.
కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో చంద్రబాబు నాయువు, పవన్ కళ్యాణ్ విరామం అన్నది ఎరుగకుండా శ్రమించారు. ఇవాళ కీలక సమావేశంలో పవన్ బాబును ఆలింగనం చేసుకున్నారు. తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. శాసన సభా పక్ష నాయకుడిగా బాబును ప్రకటించారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుపై ఉందన్నారు జనసేన పార్టీ చీఫ్.