ప్రజా తీర్పు చిరస్మరణీయం
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఎన్డీయే శాసన సభా పక్ష నేతగా ఎన్నికయ్యారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని కొనియాడారు.
ఈ సందర్బంగా కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు చైతన్యవంతులని, వారంతా అరాచక పాలనకు చరమ గీతం పాడారని, పేరు పేరునా వారికి రుణపడి ఉన్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఈ తీర్పు అద్భుతం, అమోఘం. ఇలాంటి శుభ సమయంలో తమకు వెన్నంటి ఉంటూ , మద్దతు పలికిన రామోజీ సంస్థల చైర్మన్ రామోజీరా రావు లేక పోవడం బాధాకరమన్నారు.
ఈ తీర్పు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు చంద్రబాబు. ఏపీని కాపొడు కునేందుకు ప్రజలు ముందు చూపుతో తమకు ఓటు వేశారని అన్నారు. వంద శాతం మూడు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేశారని ప్రశంసలు కురిపించారు.
జనం ఇచ్చిన స్పష్టమైన తీర్పు దేశానికే ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు. ఏది ఏమైనా తనను ఎన్నుకున్నందుకు థ్యాంక్స్ తెలిపారు చంద్రబాబు నాయుడు.