ప్రభుత్వ అతిథిగా చిరుకు పిలుపు
ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఊహించని రీతిలో మారి పోయాయి. నిన్నటి దాకా రాష్ట్రాన్ని రాచరిక పాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు చుక్కలు చూపించారు ప్రజలు. తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని జనసేన, బీజేపీ కూటమి అన్యూహంగా పవర్ లోకి వచ్చింది.
మంగళవారం జరిగిన కూటమి కీలక సమావేశంలో మూకుమ్మడిగా కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు (ఎమ్మెల్యేలు) చంద్రబాబు నాయుడు శాసన సభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఇదిలా ఉండగా గతంలో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించి , దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి , కేంద్ర మంత్రి పదవిని అనుభవించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కీలకంగా మారారు. ఎందుకంటే తన తనయుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చీఫ్. ఆయన పార్టీకి 21 ఎమ్మెల్యేలు 2 లోక్ సభ సీట్లు దక్కాయి.
దీంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేకత కలిగి ఉన్నారు చిరంజీవి. ఆయన ఫ్యామిలీ మొత్తంగా మోడీ పరివారానికి మద్దతు ఇస్తూ వచ్చారు. దీంతో 12న అమరావతిలో జరిగే ప్రమాణ స్వీకర మహోత్సవానికి రాష్ట్ర అతిథిగా పాల్గొనాలని కోరుతూ చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలికారు.