గవర్నర్ కు టీడీపీ కూటమి లేఖ
చంద్రబాబు నాయుడు మా నేత
అమరావతి – తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం జరిగిన కీలక సమావేశంలో శాసన సభ పక్ష నాయకుడిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలుసుకున్నారు.
ఈ సందర్బంగా తమ పార్టలకు చెందిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కూడిన సంతకాలతో లేఖను గవర్నర్ కు అందజేశారు. తామందరి నాయకుడు చంద్రబాబేనని, ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు , ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.
ఇదిలా ఉండగా ఈనెల 12న ఉదయం 11. 27 గంటలకు అమరావతి వేదికగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు.