DEVOTIONAL

అఖండ పారాయ‌ణం అద్భుతం

Share it with your family & friends

లోక క‌ళ్యాణం కోసం పారాయ‌ణం

తిరుమ‌ల – లోక క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల లో నిర్వ‌హించిన నాద నీరాజ‌నం భ‌క్తుల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోను చేసింది. నాద నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌వారం ఉదయం 11వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం జ‌రిగింది. భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

అయోధ్యకాండలోని 40 నుండి 44వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం నాలుగు స‌ర్గ‌ల్లో 159 శ్లోకాలు, యోగ‌వాశిష్టం , ధ‌న్వంత‌రి మ‌హా మంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 184 శ్లోకాల‌ను పారాయణం చేశారు.

ధర్మగిరి వేద పాఠశాల పండితులు డా. రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, డా. మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణదారులు, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నా‌రు

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీనివాస్ బృందం “శ్రీరామ నీనామ మేమిరుచిరా ఓరామ నీనామ మెంతరుచిరా…. ” అనే కీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, “రామ రామ యనరాదా రఘుపతి, రక్షకుడని వినలేదా ……” అనే నామ సంకీర్తనను చివరిలో రస రమ్యంగా ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.