NEWSANDHRA PRADESH

ప్రజారంజక పాలన అందించాలి

Share it with your family & friends

జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపు

అమ‌రావ‌తి – జ‌నసేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ లోని ఎన్ క‌న్వెన్ష‌న్ హాలులో తెలుగుదేశం, జ‌న‌సేన , భార‌తీయ జ‌న‌తా పార్టీల‌తో కూడిన ఎన్డీయే కూట‌మి స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్బంగా తాజాగా జ‌రిగిన శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజ‌ర‌య్యారు.

టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు నారా చంద్ర‌బాబు నాయుడిని త‌మ పార్టీ త‌ర‌పున శాస‌న స‌భా ప‌క్ష నాయ‌కుడిగా ప్ర‌తిపాదించారు. కూట‌మి త‌ర‌పున జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబు నాయుడికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

అనంత‌రం ప‌వ‌న్ ప్ర‌సంగించారు. తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. రాష్ట్రానికి మంచి రోజులు వ‌చ్చాయ‌ని అన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేసేలా పాలన ఉండాలన్నది త‌మ కొరిక అని పేర్కొన్నారు.

అపార అనుభవం ఉన్న నాయకుల అవసరం రాష్ట్రానికి ఉందన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. రాచ‌రిక పాల‌న‌కు ప్ర‌జ‌లు చ‌ర‌మ గీతం పాడారంటూ కొనియాడారు. వారికి శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్న‌ట్లు చెప్పారు.