DEVOTIONAL

అప్ప‌లాయ‌గుంట బ్ర‌హ్మోత్స‌వాలు

Share it with your family & friends

జూన్ 16న అంకురార్ప‌ణ

తిరుప‌తి – అప్ప‌లాయ‌గుంటలోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు జూన్ 16న అంకురార్ప‌ణ జ‌ర‌గ‌నుంది. శాస్త్రోక్తంగా పూజ‌లు చేప‌ట్టి ఉత్సవాలకు శ్రీ‌కారం చుట్టింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ).

17న ఉద‌యం ధ్వ‌జారోహ‌ణం, సాయంత్రం పెద్దశేష వాహ‌నంపై ఊరేగుతారు. 18న ఉద‌యం శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామి చిన్న శేష వాహ‌నంపై ఊరేగుతారు. సాయంత్రం హంస వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు. 19న ఉదయం సింహ వాహనం, సాయంత్రం ముత్యంపు పందిరి వాహ‌నంపై ఊరేగుతారు.

20న ఉద‌యం క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై, సాయంత్రం క‌ళ్యాణోత్స‌వం, స‌ర్వ భూపాల వాహ‌నంపై స్వామి వారు ఊరేగుతారు. 21న ఉద‌యం మోహినీ అవ‌తారం, సాయంత్రం గ‌రుడ వాహ‌నం, 22న ఉద‌యం హ‌నుమంత వాహ‌నం, సాయంత్రం గ‌జ వాహ‌నంపై ఊరేగుతారు.

23న ఉద‌యం సూర్య ప్ర‌భ వాహ‌నం, సాయంత్రం చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై స్వామి వారు విహ‌రిస్తారు..భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు. 24న ఉద‌యం ర‌థోత్స‌వం, సాయంత్రం అశ్వ వాహ‌నం, 25న ఉద‌యం చ‌క్ర స్నానం , సాయంత్రం ధ్వ‌జారోహ‌నం ఉంటుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 20వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

రూ.500 చెల్లించి గృహస్తులు (ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.