స్వరూపానందను అరెస్ట్ చేయాలి
బ్రాహ్మణ సమాఖ్య డిమాండ్
అమరావతి – జగన్ సర్కార్ లో కీలక స్వామిగా పేరు పొందిన స్వరూపానంద స్వామిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఊహించని రీతిలో ప్రభుత్వం మారింది . చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి కొలువు తీరింది. ఈ సందర్బంగా రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య నివేదిక కీలక వ్యాఖ్యలు చేసింది. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మీడియాతో మాట్లాడారు.
ఆయన స్వరూపానందేంద్ర స్వామిపై సీరియస్ కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డి మద్దతుతో కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలని, దేవాదాయ శాఖని బ్రష్టు పట్టించిన విశాఖ నకిలీ స్వాములోరుని తక్షణమే అరెస్టు చేయాలని కోరారు.
స్వామీజీ ధోరణి చూస్తుంటే ఏ ఎండ కా గొడుగు పట్టేలా అయన స్టేట్మెంట్ ఉన్నదని, ఊసర వెల్లులు కూడా స్వరూపానంద స్వామిని చూసి సిగ్గుపడతాయని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో నాలుగు పీఠాలు మాత్రమే ఆది శంకరాచార్యులు ప్రతిష్ట చేశారని అన్నారు.
విశాఖలో ఉన్న శారదా పీఠం నకిలీ పీఠం అని ఆరోపించారు. గతంలో స్వామీజీ వేషం ఎత్తక ముందు జగదాంబ థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడని, మద్యం తాగి ఎక్కడ బడితే అక్కడ పడి పోయేవాడని, కాషాయం వేషం వేసుకుని ఆధ్యాత్మిక వ్యాపారం ప్రారంభించాడని మండిపడ్డారు.
రాజ శ్యామల యాగం పేరుతో తెలుగు రాష్ట్రాల నేతలను ముఖ్యమంత్రి చేస్తానంటూ ప్యాకేజీ మాట్లాడుకొన్నా ఫలితం లేకుండా పోయిందన్నారు . . జగన్ ప్రభుత్వానికి రాజ గురువు లాగా వ్యవహరించి టీటీడీలో అరాచకాలు, అక్రమాలు జరుగుతుంటే ఒక్క రోజు కూడా నోరు తెరిచిన పాపాన పోలేదన్నారు.