ఏపీలో కాబోయే మంత్రులు వీరే
24 మందితో బాబు ..షా..జేపీ ఖరారు
అమరావతి – ఏపీలో కొత్తగా కొలువు తీరిన టీడీపీ కూటమికి సంబంధించి 24 మందితో మంత్రివర్గాన్ని ఖరారు చేశారు నారా చంద్రబాబు నాయుడు. కేబినెట్ కూర్పులో చంద్రబాబుతో పాటు అమిత్ చంద్ర షా, జేపీ నడ్డా , బీఎల్ సంతోష్ ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున జాబితాను విడుదల చేశారు.
ఈ లిస్టులో ఎనిమిది మంది బీసీలకు ప్రయారిటీ ఇచ్చారు. అమరావతిలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ వీరితో ప్రమాణం చేయించనున్నారు. దీనికి ప్రజా కేబినెట్ అని పేరు కూడా పెట్టారు.
కొణిదెల్ పవన్ కళ్యాణ్ (కాపు) , కింజారపు అచ్చెన్నాయుడు (బీసీ , వెలమ), కొల్లు రవీంద్ర (బీసీ మత్స్య కార) , నాదెండ్ల మనోహర్ (కమ్మ), పి. నారాయణ (కమ్మ), వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ) , సత్య కుమార్ యాదవ్ (బీసీ యాదవ్ ), నిమ్మల రామానాయుడు (కాపు) , ఎన్ఎండీ ఫరూక్ (ముస్లిం), ఆనం రామ నారాయణ రెడ్డి (రెడ్డి ) కి చోటు దక్కింది.
వీరితో పాటు పయ్యావుల కేశవ్ (కమ్మ ) , అనగాని సత్య ప్రసాద్ (బీసీ గౌడ ) , కొలుసు పార్థ సారథి (బీసీ యాదవ) , డోలా బాల వీరాంజనేయ స్వామి (ఎస్సీ మాల), గొట్టిపాటి రవి (కమ్మ), కందుల దుర్గేష్ (కాపు) , గుమ్మడి సంధ్యా రాణి (ఎస్టీ) , బీసీ జనార్దన్ రెడ్డి (రెడ్డి) , టీజీ భరత్ (ఆర్య వైశ్య), ఎస్ సవితమ్మ (కురబ) , వాసం శెట్టి సుభాష్ (బీసీ, శెట్టి బలిజ), కొండపల్లి శ్రీనివాస్ (బీసీ తూర్పు కాపు) , మండిపల్లి రామ్ ప్రసాద్ (రెడ్డి ) , నారా లోకేష్ (కమ్మ) ఉన్నారు.