కేబినెట్ కూర్పుపై బాబు..షా కసరత్తు
ఎట్టకేలకు 24 మందితో కేబినెట్ ఖరారు
అమరావతి – ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోయే టీడీపీ కూటమి ఆధ్వర్యంలో కొత్తగా కొలువు తీరే మంత్రివర్గంపై ఉత్కంఠకు తెర పడింది. ఒక రోజు ముందుగానే బిజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తో పాటు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ హాజరయ్యారు. వీరిని సాదరంగా ఆహ్వానించారు నారా చంద్రబాబు నాయుడు.
తన నివాసంలో వీరితో పాటు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఉన్నారు. చివరకు 24 మందిని ఖరారు చేశారు. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే తమ వారికి చోటు దక్కించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు అమిత్ చంద్ర షా.
పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక అనంతపురం జిల్లా నుండి ఎన్నికైన సత్య కుమార్ యాదవ్ కు కేబినెట్ లో చోటు దక్కింది. విచిత్రం ఏమిటంటే పరిటాల రవీంద్ర ఫ్యామిలీ నుంచి గెలుపొందిన పరిటాల సునీతకు మొండి చేయి చూపించారు. మొత్తంగా షా మార్క్ కనిపించింది కేబినెట్ లో.