బాబుతో బీఎల్ సంతోష్ ములాఖత్
కేబినెట్ కూర్పుపై కసరత్తు
అమరావతి – ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోయే టీడీపీ కూటమి ఆధ్వర్యంలో కొలువు తీరే మంత్రివర్గంపై ఉత్కంఠకు తెర పడింది. ఒక రోజు ముందుగానే బిజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తో పాటు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ హాజరయ్యారు.
తన నివాసంలో వీరితో పాటు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఉన్నారు. చివరకు 24 మందిని ఖరారు చేశారు. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే తమ వారికి చోటు దక్కించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు అమిత్ చంద్ర షా, బీఎల్ సంతోష్.
బీజేపీలో బీఎల్ లేకుండా ఏ పని జరగదని ప్రచారం. ఆయన సూచించిన వ్యక్తులకే ప్రయారిటీ ఉంటుందని ఆ పార్టీ వారే చెబుతుంటారు. షా తర్వాత మోస్ట్ పాపులర్ లీడర్ సంతోషే కావడం విశేషం. ఆయన కర్ణాటకకు చెందిన నేత. ప్రధానమంత్రి మోడీకి నమ్మిన బంటు.
ఇక భారతీయ జనతా పార్టీకి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు కసరత్తు చేశారు జేపీ నడ్డా. రాబోయే రోజుల్లో తమకు కూడా ప్రాధాన్యత ఉండేలా చూడాలని సూచించారు. దీంతో సత్య కు ఛాన్స్ దక్కినట్టు సమాచారం.