NEWSANDHRA PRADESH

నాలుగోసారి సీఎంగా చంద్ర‌బాబు

Share it with your family & friends

నేడే ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్రేద‌శ్ రాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా తెలుగుదేశం పార్టీ చీఫ్ , కూట‌మి నాయ‌కుడు నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. బుధ‌వారం ఉద‌యం 11.27 గంట‌ల‌కు ఆయ‌నతో గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌మాణం చేయించ‌నున్నారు.

ఉప ముఖ్య‌మంత్రిగా జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు చోటు ద‌క్క‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవాళ తెల్ల వారు జామున టీడీపీ కూట‌మి త‌ర‌పున చంద్ర‌బాబు నాయుడు 24 మందితో కూడిన మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్న వారి జాబితాను విడుద‌ల చేశారు.

అంత‌కు ముందు విజ‌య‌వాడ ఎన్ క‌న్వెన్ష‌న్ హాలులో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడును త‌మ కూట‌మి త‌ర‌పున నాయ‌కుడిగా ప్ర‌తిపాదించారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. రాష్ట్రంలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌కు కేబినెట్ లో చోటు క‌ల్పించారు చంద్ర‌బాబు. కూట‌మి త‌ర‌పున చంద్ర‌బాబుతో పాటు బీజేపీ నుంచి అమిత్ షా, జేపీ న‌డ్డా, ఎల్ సంతోష్ , పురందేశ్వ‌రి హాజ‌ర‌య్యారు.

ఇక చంద్ర‌బాబు త‌న కెరీర్ లో 4వ సారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నుండ‌డం విశేషం.