మోహన్ మాఝీ టార్చ్ బేరర్
ఒడిశా సీఎంగా యువ గిరిజన నేత
ఒడిశా – ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏరికోరి గిరిజన యువకుడైన మోహన్ మాఝీని ఎంపిక చేసుకున్నారు. అమిత్ చంద్ర షా, బీఎల్ సంతోష్ , జేపీ నడ్డాలను కాదని ఆయన ఏకంగా తనే ముందుగా పార్టీ కీలక సమావేశంలో ప్రకటించడం విశేషం.
ఇంతలా ప్రధానిని ఆకట్టుకున్న యువ నాయకులలో తమిళనాడుకు చెందిన అన్నామలై కుప్పు స్వామి, ఒడిశాకు చెందిన మోహన్ మోఝీ, తెలంగాణకు చెందిన బండి సంజయ్ , బీహార్ కు చెందిన లోక్ జన్ శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, జయంతి చౌదరి లాంటి వాళ్లు ఉన్నారు.
ఎవరూ ఊహించన రీతిలో భారతీయ జనతా పార్టీ పరంగా చూస్తే ఒడిశాలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు మాఝీ. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అంతే కాదు రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన నవీన్ పట్నాయక్ ను ఎదుర్కోవడంలో సక్సెస్ అయ్యాడు. తాను ముందుండి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేలా చేశాడు.
మినరల్ రిచ్ కియోంజర్ స్థానం నుంచి మోహన్ మోఝీ 11, 577 ఓట్ల తేడాతో గెలుపొందారు. తను సీఎంగా కొలువు తీరనున్నారు.