ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత
బాబు మంత్రివర్గంలో చోటు
అమరావతి – ఏపీలో కొలువు తీరిన టీడీపీ కూటమి మంత్రివర్గంలో 24 మందికి చోటు లభించింది. పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తో పాటు జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ అర్ధరాత్రి వరకు కసరత్తు చేశారు. కులాలు, సామాజిక వర్గాల వారీగా పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు.
రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మహిళా కోటా కింద వంగలపూడి అనితకు చోటు దక్కింది. తండ్రి అప్పారారు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఎంఏ లిటరేచర్ చదివారు. అంబేద్కర్ యూనివర్శిటీ నుంచి ఎంఈడీ చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజవరంలో టీచర్ గా పని చేశారు. 2014లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ పరంగా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు.
2024 పాయకరావుపేట లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి..కంబాల జోగులు మీద 43,737వేల పై ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.