బాబు ప్రమాణం మోదీ ఆలింగనం
సోషల్ మీడియాలో సంచలనం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ చీఫ్, కూటమి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఏపీలోని అమరావతి ఐటీ పార్కు ప్రాంగణంలో అశేష జనవాహిని సమక్షంలో సీఎంగా కొలువు తీరారు.
ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. రాజకీయ, సినీ , క్రీడా రంగాలకు చెందిన వారు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి విశిష్ట అతిథిగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడును ఆలింగనం చేసుకున్నారు.
అభివృద్దే ధ్యేయంగా ఏపీ ఇక నుంచి ముందుకు వెళుతుందని ప్రకటించారు కొత్త సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎలాంటి ప్రలోభాలకు తావు ఇవ్వకుండా పాలన సాగుతుందన్నారు. ఇది ప్రజా కేబినెట్ అంటూ అభివర్ణించారు. మొత్తం 24 మందితో కేబినెట్ ను రూపొందించారు. అంతకు ముందు కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ అర్ధరాత్రి వరకు చర్చించారు. తుది జాబితాను క్లియర్ చేశారు. ఇవాళ తెల్ల వారుజామున ప్రకటించారు.