NEWSANDHRA PRADESH

గాడి త‌ప్పిన బాబు పాల‌న

Share it with your family & friends

విజ‌య సాయి రెడ్డి కామెంట్

అమ‌రావ‌తి – ఏపీలో తాజాగా కొలువు తీరిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసింది వైసీపీ. అధికారంలోకి వ‌చ్చామ‌న్న గ‌ర్వంతో త‌మ వారిపై దాడుల‌కు దిగుతున్నారంటూ మండిప‌డ్డారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు విజ‌య సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి. బుధ‌వారం వారు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణం లేకుండా పోయింద‌ని వాపోయారు. అధికారం కోసం ఏమైనా చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు , ప‌చ్చి అవ‌కాశ వాది నారా చంద్ర‌బాబు నాయుడు అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. న్యాయం లేద‌ని, ప్ర‌స్తుతం అన్యాయ‌మే రాజ్యం ఏలుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

తాము ఫిర్యాదు చేసినా అధికారులు తీసుకోవ‌డం లేద‌ని వాపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యానికి ముప్పు ఏర్ప‌డింద‌న్నారు . గ‌త వారం రోజులుగా టీడీపీ ఆధ్వ‌ర్యంలో చేస్తున్న దాడులు దారుణ‌మ‌న్నారు.

ప్రమాణ స్వీకారం కన్నా ముందే దాడులు జరపండి అని చంద్రబాబే ప్రేరేపించారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డి. ఆట‌విక పాల‌న ప్రారంభ‌మైంద‌ని మండిప‌డ్డారు. దాడుల‌ను చూస్తూ కూర్చునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు.