DEVOTIONAL

శ్రీ‌వారి స‌న్నిధిలో సీఎం చంద్ర‌బాబు

Share it with your family & friends

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ఏఈవో వీర‌బ్ర‌హ్మం

తిరుమ‌ల – ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కొలువు తీరిన నారా చంద్ర‌బాబు నాయుడు కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల‌కు చేరుకున్నారు. ఆయ‌న‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికింది. టీటీడీ అద‌న‌పు కార్య నిర్వ‌హ‌ణ అధికారి వీర బ్ర‌హ్మం ఆధ్వ‌ర్యంలో గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు.

చంద్ర‌బాబు నాయుడ‌తో పాటు మంత్రిగా కొలువు తీరిన త‌న‌యుడు నారా లోకేష్ , నారా బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రితో పాటు కుటుంబ స‌భ్యులు స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. చంద్ర‌బాబు రాకతో తిరుమ‌ల ప్రాంగ‌ణం అంతా భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

గురువారం భారీ ఎత్తున వ‌ర్షం కురుస్తుండ‌డం, భ‌క్తులు భారీ ఎత్తున త‌ర‌లి రావ‌డంతో పుణ్య క్షేత్రం కిట కిట లాడుతోంది. ఇదిలా ఉండ‌గా తాను ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే తిరుమ‌ల‌కు వ‌స్తాన‌ని, స్వామి వారిని ద‌ర్శించుకుంటాన‌ని వెల్ల‌డించారు. ఆ మేర‌కు కుటుండ స‌మేతంగా కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిని సంద‌ర్శించారు నారా చంద్ర‌బాబు నాయుడు.