NEWSANDHRA PRADESH

మోడీ..ప్ర‌త్యేక హోదా సంగ‌తేంటి..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ర‌ఘు వీరా రెడ్డి

అమ‌రావ‌తి – మాజీ మంత్రి , ఏపీ పీసీసీ మాజీ చీఫ్ నీల‌కంఠాపురం ర‌ఘు వీరా రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారోత్స‌వం స‌రే గ‌తంలో న‌రేంద్ర మోడీ ఇచ్చిన హామీల సంగ‌తి మాటేమిటి అంటూ మండిప‌డ్డారు.

హామీలు ఇవ్వ‌డం, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం జ‌త క‌ట్ట‌డం భార‌తీయ జ‌న‌తా పార్టీకి అల‌వాటుగా మారింద‌ని ఆరోపించారు. గ‌తంలో ఇదే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని ప్ర‌క‌టించార‌ని, అన్ని వేళ‌లా ఆదుకుంటాన‌ని భ‌రోసా ఇచ్చార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు వాటిని అమ‌లు ప‌రిచిన దాఖ‌లాలు లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు నీల కంఠాపురం ర‌ఘు వీరా రెడ్డి.

అటు కేంద్రంలో ఇటు ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ‌మే ఉంద‌ని ఇక‌నైనా సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఏపీ అభివృద్దికి సంబంధించి దృష్టి సారించాల‌ని మాజీ మంత్రి కోరారు. లేక‌పోతే ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని హెచ్చ‌రించారు.