SPORTS

పసి కూన‌ల దెబ్బ‌కు ప‌రేషాన్

Share it with your family & friends

చెమ‌టోడ్చి నెగ్గిన టీమిండియా

అమెరికా – ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భాగంగా న్యూయార్క్ వేదిక‌గా జ‌రిగిన‌ కీల‌క పోరులో యుఎస్ఏ క్రికెట్ టీమ్ చుక్క‌లు చూపించింది టీమిండియాకు. అతి క‌ష్టం మీద గెలుపొందింది. విజ‌యం సాధించేందుకు మ‌నోళ్లు నానా తంటాలు ప‌డ్డారు. సూర్య కుమార్ యాద‌వ్ , శివ‌మ్ దూబే రాణించ‌డంతో ఎట్ట‌కేల‌కు మూడో గెలుపు ద‌క్కింది.

ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది భార‌త స్టార్ బౌల‌ర్ అర్ష్ దీప్ సింగ్. త‌ను క‌ళ్లు చెదిరే బంతుల‌తో దుమ్ము రేపాడు. అమెరికా ప్లేయ‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. మిస్సైల్ కంటే వేగంగా బంతుల్ని విసిరాడు. ఒకానొక ద‌శలో డిఫెన్స్ ఆడేందుకు సైతం నానా తంటాలు ప‌డ్డారు.

సింగ్ 4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 9 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. ఏకంగా 4 వికెట్లు కూల్చాడు. అమెరికా జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు. గ‌తంలో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో 11 ప‌రుగుల‌కు నాలుగు వికెట్లు తీసిన ర‌వి చంద్ర‌న్ అశ్విన్ పై ఉన్న రికార్డ్ ను చెరిపేశాడు. పాండ్యా 14 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

ముందుగా 110 ప‌రుగుల‌కే యుఎస్ఏను క‌ట్ట‌డి చేసింది. అనంత‌రం 111 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు నానా తంటాలు ప‌డింది. సూర్య 40 బంతులు ఆడి హాఫ్ సెంచ‌రీ చేశాడు. 2 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి. దూబే 35 బంతులు ఆడి 31 ర‌న్స్ చేశాడు. ఇద్ద‌రూ నాటౌట్ గా నిలిచారు.