సింగ్ ఈజ్ కింగ్
బౌలింగ్ అదుర్స్
అమెరికా – యుఎస్ లోని న్యూయార్క్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కీలక మ్యాచ్ లో భారత జట్టు పడుతూ లేస్తూ అతి కష్టం మీద గెలుపొందింది. ఒక రకంగా చెప్పాలంటే పసి కూనలుగా భావిస్తూ వచ్చిన అమెరికా జట్టు చుక్కలు చూపించింది టీమిండియాకు.
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది ఆతిథ్య జట్టు యుఎస్ఏ. అనంతరం మైదానం లోకి దిగిన భారత జట్టు రన్స్ చేసేందుకు ఇబ్బంది పడింది. ఈ టోర్నీలో వరుసగా వైఫల్యం చెందుతూ వచ్చాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం నిరాశ పరిచాడు.
సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబే ఆదుకున్నారు. సూర్య హాఫ్ సెంచరీ చేస్తే శివమ్ 31 రన్స్ చేశాడు. దీంతో భారత్ గట్టెక్కింది. అంతకు ముందు ముందుగా బ్యాటింగ్ కు దిగిన అమెరికా జట్టుకు చుక్కలు చూపించాడు అర్ష్ దీప్ సింగ్. తను 4 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీశాడు.
భారత జట్టు మూడు విజయాలు సాధించి తన బెర్త్ ను కన్ ఫర్మ్ చేసుకుంది. దీంతో పాకిస్తాన్ పండుగ చేసుకుంటోంది.