దేశం సుభిక్షంగా ఉండాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్
అమరావతి – ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ . ఆయన విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై కొలువు తీరిన కనక దుర్గ అమ్మ వారిని దర్శించుకున్నారు. బండి సంజయ్ కుమార్ కు ఆలయ పాలక మండలి సాదర స్వాగతం పలికింది.
అమ్మ వారి కరుణ కటాక్షలు ప్రజలందరిపై ఎప్పుడూ ఉండాలని తాను ప్రార్థించినట్లు స్పష్టం చేశారు. కనక దుర్గమ్మ అమ్మ వారిని దర్శించు కున్నంత అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అమ్మ వారి కరుణ అందరిపై ఉండాలని, 143 కోట్ల ప్రజలంతా ఆయు రారోగ్యాలతో , అష్ట ఐశ్వర్యాలతో తల తూగాలని కోరుకున్నట్లు తెలిపారు.
బండి సంజయ్ కుమార్ పటేల్ ను ఆలయ పూజారులు ఆశీర్వచనాలు అందించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిత్ర పటం ఇచ్చి సత్కరించారు. సమర్థవంతమైన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎదురే లేదన్నారు. తమ లీడర్ సారథ్యంలో భారత్ అన్ని రంగాలలో ముందుకు వెళుతుందన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.