ENTERTAINMENT

నటుడు పృథ్వీరాజ్‌కు షాక్

Share it with your family & friends

అరెస్టు వారెంట్‌ జారీ

విజయవాడ : సినీ ఇండస్ట్రీలో ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ పేరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు పృథ్వీరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య శ్రీలక్ష్మి అతడి పై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరు కావడం లేదని ఫ్యామిలీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండ‌గా గ‌తంలో వైసీపీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్ గా మారి పోయి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశాడు.

పృథ్వీ రాజ్ కు టీటీడీ ఎస్వీ బీసీ చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు అప్ప‌టి సీఎం జ‌గ‌న్ రెడ్డి. కానీ ఊహించ‌ని రీతిలో ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఉన్న‌ట్టుండి తానంత‌కు తానుగా రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత వైసీపీని వీడారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెంత‌కు చేరారు.

ఆయ‌న‌కు మ‌న‌సారా మ‌ద్ద‌తు ఇచ్చారు. తాజాగా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి ఆధ్వ‌ర్యంలో కొత్త స‌ర్కార్ కొలువు తీరింది. ఈ త‌రుణంలో పృథ్వీ రాజ్ కు షాక్ త‌గ‌ల‌డంతో త‌ట్టుకోలేక పోయారు.