తిరుమలను ముట్టుకుంటే నాశనమే
వేంకటేశ్వరుడి జోలికి వెళితే కష్టమే
తిరుమల – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తిరుమలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఎవరైనా సరే , ఎంతటి స్థాయిలో ఉన్నా సరే తిరుమల కొండపై వెలసిన దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ని దర్శించుకునే ప్రయత్నం చేయాలే తప్పా తల తిక్క చేష్టలు చేయడం, ఆయనకు సంబంధించిన డబ్బులను వాడుకునే ప్రయత్నం ఎవరు చేసినా వారికి శిక్ష తప్పదన్నారు.
ప్రపంచంలోనే ఇంతటి మహిమలు కలిగిన దేవుడు లేడన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ తాను బతికి ఉన్నానంటే ఆయన వల్లనేనని చెప్పారు. ఆనాడు తనపై నక్సలైట్లు దాడి చేసినప్పుడు తృటిలో ప్రాణాలతో బయట పడ్డానని , ఇవాళ రాక్షస , రాచరిక పాలన సాగించిన సైకో జగన్ రెడ్డి నుండి రాష్ట్రాన్ని రక్షించిన ఘనత తనది కాదని ఆ స్వామి వారిదేనని చెప్పారు.
మిగతా దేవుళ్లు చేసిన తప్పులకు వచ్చే జన్మలో శిక్షిస్తారేమోనని కానీ శ్రీ వేంకటేశ్వర స్వామి విషయంలో అలా కాదన్నారు. ఈ జన్మ లోనే శిక్ష తప్పక ఉంటుందన్నారు.