NEWSANDHRA PRADESH

అన్నీ ఇచ్చాం అయినా ఓడి పోయాం

Share it with your family & friends

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఏపీలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశామ‌ని, వేల కోట్లు ప్ర‌జ‌ల‌కు అందించినా ఎందుక‌నో ఆద‌రించ లేక పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

గురువారం క్యాంపు ఆఫీసులో జ‌గ‌న్ రెడ్డి స‌మీక్షించారు. ఈ సంద‌ర్బంగా ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో పాటు ఓడి పోయిన వారంతా హాజ‌ర‌య్యారు. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రిచుకుంది. జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదన్నారు.

గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేశామ‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి. మేనిఫెస్టోను బైబిల్ లాగా , ఖురాన్ లాగా, గీత లాగా ఒక ప‌విత్ర‌మైన గ్రంథంగా భావించి అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్షా లేకుండా అందించామ‌ని అన్నారు. ఏ నెలలో ఏమిస్తామో… ప్రతి సంవత్సరం కాలెండర్ విడుదల చేసి, ఆమేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశామ‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉంది. ఇంటింటికీ మనం చేసిన మంచి బ్రతికే ఉంది. మనం చేసిన పాలన మీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంద‌న్నారు.