ఓం శ్రీరామ్ రాసిన కేంద్ర మంత్రి
విమాన ఛార్జీలు తగ్గించేలా చూస్తా
న్యూఢిల్లీ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు సంచలనంగా మరారు. ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఊహించని రీతిలో ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది. దీని వెనుక టీడీపీ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడనేది జగమెరిగిన సత్యం.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ యువ నాయకుడు పార్లమెంట్ లో తన వాణిని వినిపిస్తూ వచ్చారు. కానీ ఈసారి మోడీ సర్కార్ లో టీడీపీ, జనసేన భాగంగా ఉంది. దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీని సాధించ లేక పోయింది భారతీయ జనతా పార్టీ . దీంతో బీహార్ కు చెందిన నితీశ్ కుమార్ , ఏపీకి చెందిన చంద్రబాబుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఇక బీజేపీ నుంచి ఒకరికి టీడీపీ నుంచి ఇద్దరికి కేబినెట్ లో చోటు కల్పించారు మోడీ. ఇదిలా ఉండగా గురువారం మంచి రోజు కావడంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రామ్మోహన్ నాయుడు. అంతకు ముందు ఆయన ఓ కాగితంపై ఏకంగా 21 సార్లు ఓం శ్రీరామ్ అంటూ రాశారు. ఆ తర్వాత సంతకం చేయడం విశేషం.