ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
అమరావతి – మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమకు అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారని , ప్రస్తుతం టీడీపీ కూటమికి పట్టం కట్టారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్బంగా తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. అక్కడ డీఎంకేకు ఊహించని రీతిలో గతంలో షాక్ ఇచ్చారని, 234 సీట్లకు గాను ఆ పార్టీకి 2 సీట్లు మాత్రమే గెలుపొందారని గుర్తు చేశారు.
ఆ తర్వాత తిరిగి ఊహించని రీతిలో డీఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో పవర్ లోకి వచ్చిందన్నారు అనిల్ కుమార్ యాదవ్. రాజకీయాలలో గెలుపు ఓటములు శాశ్వతం కాదన్నారు మాజీ మంత్రి. 40 శాతం ప్రజలు ఇంకా తమ వైపు ఉన్నారని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.
వచ్చే సారి తమ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఇది వాస్తవమని పేర్కొన్నారు. తాము ఓడి పోవడంపై సమీక్ష చేసుకుంటున్నామని, జగన్ రెడ్డి సారథ్యంలో ముందుకు వెళతామని ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పారు.