ఐఏఎస్..ఐపీఎస్ ల తీరు బాధాకరం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సచివాలయంలో కొలువు తీరారు. ఈ సందర్బంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కొందరు పరిధి దాటి వ్యవహరించారని, ఇలా ఏకపక్షంగా ఉంటారని తాను కలలో కూడా అనుకోలేదన్నారు నారా చంద్రబాబు నాయుడు.
తాను 1995 నుంచి పలు దఫాలుగా ముఖ్యమంత్రిగా పని చేశానని, ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఐఏఎస్ లు, ఐపీఎఎస్ అధికారులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
మరోసారి శాఖల వారీగా సమావేశం అవుతానని, సమీక్ష చేపట్టి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇక నుంచైనా తమ పనితీరు మార్చు కోవాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చక్రం తిప్పిన సీనియర్ ఉన్నతాధికారులు ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి, పీఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన పుష్ప గుచ్ఛాలను సీఎం తిరస్కరించారు.